శేఖర్ కమ్ముల బర్త్ డే… నాగ చైతన్య శుభాకాంక్షలు

302
Birthday wishes to Sekhar Kammula : Naga Chaitanya

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత శేఖర్ కమ్ముల పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ములకు అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. “లవ్ స్టోరీ”లో మీతో కలిసి పని చేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నిజంగా ఇదొక స్పెషల్ మూమెంట్… పుట్టినరోజు శుభాకాంక్షలు శేఖర్ కమ్ముల” అంటూ శేఖర్ కమ్ములకు నాగ చైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం “లవ్ స్టోరీ”లో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. పెద్ద కలలతో నగరానికి వెళ్ళే ఇద్దరు వ్యక్తుల రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. రేవంత్ పాత్రలో చైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి నటించారు.

ఈ చిత్రం నుంచి ఇంతకుముందు విడుదలైన “ఏయ్ పిల్లా” అనే పాట వీక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 16 న తెరపైకి రానున్న ఈ చిత్రానికి పవన్ సి సంగీతం అందిస్తున్నారు.

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. ఆరు నంది పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శేఖర్ కమ్ములకు అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.