బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ స్వయంగా ఆలియా కశ్యప్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనయ ఆలియా కశ్యప్.
బికినీ ఫొటోలు షేర్ చేసినందుకు గాను తనను వేశ్యతో పోల్చుతూ ‘ఒక్క రాత్రికి నీ రేటెంత?’ అని అడుగుతున్నారని ఆలియా చెప్పింది.
కొందరైతే రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరిస్తున్నారని, ఇండియన్ కావడం వల్ల అలాంటి పోస్ట్‌లు చేయడం పట్ల సిగ్గుపడాలని తనకు చెప్తున్నారని చెప్పుకొచ్చింది.
అయితే ఈ ఇన్సిడెంట్‌తో తనలో తాను చాలా కృంగిపోయానని, అప్పటినుంచి తన సోషల్ మీడియాలో ఏదైనా నెగెటివ్ కామెంట్ కనిపిస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేస్తున్నానని ఆలియా పేర్కొంది.
View this post on Instagram
తాను సినిమాల్లోకి రావాలని అనుకోవడం లేదంటూ తన సినిమా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆలియా కశ్యప్.. తన సోషల్ మీడియా ఖాతాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు చేస్తుంటుంది.