హెల్మెట్ లేకుండా బైక్‌ నడిపితే లైసెన్స్ రద్దు!

247
License revoked bike without helmet!

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరిస్తున్నారు.

హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌ద‌ని ట్రాఫిక్ పోలీసులు ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ చాలా మంది నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ బండ్లను నడుపుతూ  ఉంటారు.

ప్ర‌మాదం జ‌రిగితే త‌ల‌కి గాయ‌మై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధ‌న‌ల‌ను మ‌రితం క‌ఠిన‌త‌రం చేస్తున్నారు.

హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర వాహ‌నాలు నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు.

ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే చలానాతో సరిపెట్టబోమని పేర్కొన్నారు.

మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని చెప్పారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి ప‌ట్టుబ‌డితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని ట్విట్ట‌ర్ లో తెలిపారు.