పాపులర్ కమెడియన్, హీరో సునీల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘వేదాంతం రాఘవయ్య’.
ఈ సినిమాలో సునీల్ తో అనసూయ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి కథనందించడంతో పాటు సమర్పకులుగానూ వ్యవహరిస్తున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాలో అనసూయ కాలేజ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సునీల్ పక్కన కనిపించింది.
కాగా అనసూయ ప్రస్తుతం మరే ఇతర యాంకర్లు, నటీమణులు లేనంత బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు అన్ని సినిమాల్లో నటిస్తోంది.
ఈ మేరకు ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే మూవీలో గర్భవతిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తోంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. వీటితో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
మరోవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు అనసూయ సెలెక్ట్ అయ్యింది.
కాగా ఇప్పటికే అనసూయ వెండితెరపై ‘రంగస్థలం’ లో రంగమ్మత్త, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాల్లో పలు పాత్రలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.