అనసూయపై నెటిజన్ సెటైర్… ఘాటు కౌంటర్ ఇచ్చిన హాట్ యాంకర్

211
Anchor Anasuya Strong Answer to Netizen

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరపై పలు షోలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే, మరోవైపు వెండితెరపై సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం అనసూయ పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ తన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలు, తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా అనసూయ ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది.

అన‌సూయ రీసెంట్‌గా లంగా వోణిలో ఫొటో షూట్ చేసి వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒకదానికి ఓ నెటిజ‌న్ “నువ్వేమైన అఆ సినిమాలో స‌మంత అనుకుంటున్నావా?” అంటూ సెటైరిక‌ల్ కామెంట్ పెట్టాడు.

దీనికి స్పందించిన అన‌సూయ‌ “అయ్య‌య్యో.. లేద‌మ్మా న‌న్ను అన‌సూయ అంటారు” అని బ‌దులిచ్చింది.

దీనికి స‌ద‌రు నెటిజ‌న్ “సారీ మేడమ్.. జోక్ చేశాను. లైట్ తీసుకోండి” అని అన్నాడు.

అతని సారీకి స్పందించిన అనసూయ “నీది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని అర్ద‌మైంది. త్వ‌ర‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను” అంటూ బ‌దులిచ్చింది.

అనసూయ అతనికి బదులిచ్చిన తీరుకు ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.