ఏల్ విజయ్ .. ఐశ్వర్యల వివాహం గురువారం చెన్నైలో ప్రైవేట్ ఫంక్షన్‌గా జరిగినట్టు తెలుస్తుంది. పెళ్లి దుస్తులలో ఉన్న వారికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుకకి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది.
ఏఎల్ విజయ్ ప్రస్తుతం దేవి 2 చిత్రంతో పాటు జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, తమిళంలో విడుల కానున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది.