కేంద్ర క్రీడా మంత్రి బాటిల్ క్యాప్ చాలెంజ్..వైరల్ వీడియో

278
bottle cap challenge

బాటిల్ క్యాప్ చాలెంజ్.. సోషల్ మీడియా గురించి.. వైరల్ హాష్‌టాగ్స్ గురించి తెలిసిన వాళ్లందరికీ ఈ చాలెంజ్ సుపరిచితమే. సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా బాటిల్ క్యాప్ చాలెంజ్ వైరల్ అవుతోంది. అయితే ఇది అంత ఈజీ చాలెంజ్ కాదు. అందరూ ఈ చాలెంజ్‌లో విన్ కాలేరు. దీనికి టెక్నిక్ కావాలి. బాటిల్‌కు ఉన్న క్యాప్‌ను వెనుక నుంచి పాదాలతో తన్ని తీయాలి. అదే బాటిల్ క్యాప్ చాలెంజ్.

తాజాగా కేంద్ర క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు.. బాటిల్ క్యాప్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఆయన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాటిల్ క్యాప్ చాలెంజ్‌లో పాల్గొని.. ఆ చాలెంజ్‌లో విన్ అయిన వీడియోను మంత్రి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. డ్రగ్స్ కి నో చెప్పండి,ఫిట్ ఇండియా క్యాంపెయిన్ కి రెడీగా ఉండండి అన్న హ్యాష్ ట్యాగ్ లతో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రిజిజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడా మంత్రి అంటే మీలాగే ఫిట్ గా ఉండాలి సార్ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

నిజానికి ఈ బ్యాటిల్ క్యాప్ చాలెంజ్‌ను టైక్వాండో నిపుణుడు, ఫైటర్ ఫరాబి స్టార్ట్ చేశాడు. అలా అలా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఈ చాలెంజ్‌లో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
చివరకు ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొన్ని విన్ అయ్యారు.