స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ టూర్ వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ త ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దుబాయ్‌లోని ఫేమస్ థీమ్ పార్క్‌ను సందర్శించిన బన్నీ… అక్కడ పిల్లలతో గేమ్స్ ఆడిస్తూ కనిపించాడు.
బన్నీ చిల్డ్రన్స్ ప్లే మ్యూజియం ఎయిర్ గ్యాలరీలో అర్హను ఆడిస్తూ ఉన్న వీడియోను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
View this post on Instagram
గత కొన్ని రోజుల నుంచి “పుష్ప” షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నాడు.
త్వరలో కేరళ షెడ్యూల్‌కు రెడీ కానున్నారు. కేరళ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఈ చిత్రం.
ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్ట్ 13న ఈ చిత్రాన్నివిడుదల చేయనున్నారు.