తమిళ హీరో విశాల్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్ ‘చక్ర’ చిత్రంలో నటిస్తున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘చక్ర’ డబ్బింగ్ వర్షన్ శుక్రవారం విడుదల కాబోతోంది.
అయితే ‘చక్ర’ సినిమా కథపై హక్కులు తమవే అంటూ నిర్మాత రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
దాంతో హైకోర్టు విశాల్ కు షాక్ ఇచ్చింది. పిటీషన్ ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.
తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు “చక్ర” సినిమాను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో “చక్ర” రేపు ఉదయం అనుకున్న సమయానికే విడుదల కాబోతోంది.
ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు తమ చిత్రం విడుదలపై ఉన్న స్టే ను ఎత్తివేసిందని విశాల్ ట్వీట్ చేశాడు.
“నిజం గెలుస్తుంది. ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నిర్మాతకు మాత్రమే కాకుండా చిత్ర బృందం మొత్తానికి సంతోషాన్ని కలిగించే విషయం” అంటూ విశాల్ ట్వీట్ చేశారు.
All Clear for #Chakra –
Grand Worldwide Release Tomorrow #ChakraFromTomorrow#ChakraKaRakshak#VishalChakra pic.twitter.com/eWxJKrwJ8y
— Vishal (@VishalKOfficial) February 18, 2021