
న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పకడ్బందీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది.
ఈ ఏడాది మార్చి 1వ తేదీ లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది.
హత్య జరిగిన సమయంలో అక్కడున్న ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తించి, సాక్షులుగా చేర్చాలని కోర్టు తెలిపింది.
ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి మార్చి ఒకటికి కోర్టు వాయిదా వేసింది.