‘రాజి’ ట్రైలర్

358
Alia Bhatt, Vicky Kaushal 'Raazi’ Trailer

మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజి’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండో-పాక్ జంట ఇతివృత్తంతో తెరకెక్కింది.


పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లాడి అక్కడికి వెళ్లిపోయిన సెహ్మత్ అనే భారత అమ్మాయి తన మాతృదేశం కోసం గూఢచారిగా ఎలా పనిచేసిందనేదే కథ. జంగ్లీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈరోజు విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటోంది. కొంత మంది ప్రేక్షకులైతే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోందని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.