నటి శ్రీసుధ కారుకు యాక్సిడెంట్… హత్యాయత్నం అంటూ శ్యామ్ కె.నాయుడుపై ఆరోపణలు

276
Actress Sri Sudha Police Complaint Against Shyam K. Naidu

ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై ‘అర్జున్ రెడ్డి’ నటి శ్రీసుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేసింది.

దీంతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది.

తాజాగా శ్రీ సుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చంపడానికి చేసిన కుట్ర అంటూ శ్రీ సుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ యాక్సిడెంట్ వెనక శ్యామ్ కే నాయుడు కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది.

తనను హత్య చేయడానికే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీసుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది.