తీన్ మార్ మల్లన్నకు డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చిన రాణి రుద్రమ

300
rani rudrama direct warning to teenmaar mallanna

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా రాణి రుద్రమ పట్టభద్రుల సమావేశం లో మాట్లాడుతూ మీడియా సమక్షంలో తీన్మార్ మల్లన్నకు తీవ్ర హెచ్చరిక చేసారు.. కానీ ఎక్కడ అతని పేరును ప్రస్తావించకుండా మీడియా వారికి అందరికి అర్ధమయ్యేవిధంగా చాల ఆవేశపరమైన వార్నింగ్ ఇచ్చారు.

ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది అతిపెద్ద ఆయుధం మన చేతుల్లో..దాన్ని ఎలా వాడితే ఆలా సరైన ప్రతిఫలం ఇస్తది..ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో వచ్చిన రాకున్నా ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు వాడుకోవచ్చు.. అని అంటూ..

సోషల్ మీడియా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా ..కాదు వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా ..

యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెల్లారి లేస్తే ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడే, అసభ్య పదజాలం తోటి, సంస్కారం లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గ జనం ముందుకు వస్తున్నటువంటి ఒక వ్యక్తి

ఒక రెండు రోజులనుండి మొదలువెట్టిండు సోషల్ మీడియా ల ఒక టీంను పెట్టుకొని ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రచారం మీ అందరికి తెలిసిందే..

మేము ఎప్పుడైతే గెలుపు రేసులో ముందుకు వచినమో ఇగ భయం మొదలై ఒక రకమైనటువంటి అసత్య ప్రచారాలు , అసభ్య ప్రచారాలు మొదలువెట్టిండు.

ఆ వ్యక్తికి డైరెక్ట్ గ చెప్తున్నా నేను…
బిడ్డా..నువ్వెదన్న చేసుకోదల్సుకుంటే నీ వరకు నువ్వు చేసుకో… యూట్యూబ్ ల అధికార పార్టీని విమర్శ చేసుకోదల్సుకుంటే చేసుకో..

లేదూ.. మేము ప్రతార్థులపైన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాం..మహిళాల్నికూడా గౌరవించకుండా సోషమీడియా టీం ని పెట్టుకొని అగౌరవపరుస్తామని చెప్తే…

రేపు పొద్దున్న మేము సైబర్ క్రిములకు కంప్లైంట్ చేశాడో లేకపోతే బతిలాడుదు బతిమాలుడో చెయ్యం …నీకు నీ సోషల్ మీడియాకి నాలుక చీరేస్తామని చెప్తున్నా మీకు …

ఇక్కడ వార్నింగ్ ఇస్తున్న పాండవేత్తి తొక్కుతాం…వొళ్ళు దగ్గర పెట్టుకొని నీ టీం కు చెప్పుకో..నువ్వు తిడితే అధికార పార్టీ ఊకుంటది కావచ్చు కానీ ఇవాళ రాణి రుద్రమ ఉకోదు..రాణి రుద్రమ రౌద్రం ఎలావుంటదో చూడాలనుకుంటే అధికార పార్టీవాళ్లను అడుగు చెప్తారు..

నీ గురుంచి మాకనవసరం .. మా ప్రచారం మేము చేసుకుంటున్నాం.. తెలంగాణా ఆకాంక్షలు సాధించటం కోసం పోటీ చేస్తున్నాం. నువ్వు ఆఫ్ట్రాల్ గానివి నీ ఇష్టమొచ్చిన ప్రచారం నువ్వు చేసుకో ..మా జోలికొస్తే మాత్రం వొళ్ళు పలగ్గొడుతాం, మీడియా ముఖంగా వార్నింగ్ ఇస్తున్నాం అని అన్నారు.