వ్యభిచారం కేసులో నటి అరెస్ట్

426
actress-arrested-for-running-prostitution-racket

వ్యభిచారం కేసులో తమిళ నటి సంగీత బాలన్‌ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో ఆమె ఓ వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్‌పై దాడి చేశారు. వివిధ రాష్ర్టాలకు చెందిన యువతులను రిసార్ట్ నుంచి రక్షించారు. వాళ్లందరినీ రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించారు. సతీష్ అనే వ్యక్తితో కలిసి సంగీత బాలన్ ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నది. 

వీళ్ల‌ను ఎగ్మోర్‌లోని మెట్రోపాలిట‌న్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆ త‌ర్వాత జైలుకు పంపించారు. సినిమాలు, టీవీషోలలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఈ ఇద్దరూ అమ్మాయిలను ఆకర్షించే వాళ్లని పోలీసులు చెప్పారు. 1996లో కరుప్పు రోజా అనే మూవీతో సంగీత తెరంగేట్రం చేసింది. వాణి రాణి, చెల్లమె అవవల్, వల్లీలాంటి టీవీ షోలతోనూ సంగీత పాపులర్ అయింది.