సుష్మా స్వరాజ్ కు తప్పిన ఘోర ప్రమాదం

277
Sushma Swaraj's plane goes missing for 14 minutes

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఘోర ప్రమాదం తప్పింది. సుష్మ ప్రయాణిస్తున్న మేఘదూత్ విమానం 14 నిమిషాల పాటు రాడార్ సిగ్నలింగ్ సిస్టం నుంచి కనిపించుకుండా పోయింది. దాంతో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అయింది. చివరికి మారిషస్ ఏటీసీ మేఘదూత్ ని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బ్రిక్స్ దేశాల సదస్సు కోసం 5 రోజుల పాటు దక్షిణాఫ్రియాలో పర్యటనకు వెళ్లారు సుష్మా స్వరాజ్. కేరళ తిరువనంతపురం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం IFC 31లో మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాలకు మారిషస్ బయల్దేరి వెళ్లారు. మేఘదూత్ విమానం ఏకధాటిగా దక్షిణాఫ్రికాకు ప్రయాణించేంత ఫ్యూయెల్ కెపాసిటీ ఉండదు. దక్షిణాఫ్రికా వెళ్లాలంటే.. మారిషస్ లో ఆగి ఇంధనం నింపుకోవాల్సి ఉంటుంది.



భారత గగనతలం నుంచి మాలే ATCకి 4 గంటల 44 నిమిషాలకు సమాచారం అందింది. తర్వాత కొద్దిసేపటికే మారిషస్ ATC నుంచి సుష్మ ప్రయాణిస్తున్న విమానంతో సంబంధాలు తెగిపోయాయి. మామూలుగా ఓ విమానం అరగంట పాటు ATCకి అందుబాటులోకి రాకపోతే ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఫ్లైట్ మిస్సైందని ప్రకటిస్తారు. కానీ సుష్మ హై ప్రొఫైల్ వీఐపీ కావడంతో 12 నిమిషాల్లోనే డేంజర్ సిగ్నల్ పంపింది. INCRFAను యాక్టివేట్ చేశారు. చివరికి 4 గంటల 58 నిమిషాలకు విమానం జాడ తెలుసుకున్న మారిషస్ ATC సుష్మ విమానం సేఫ్ ల్యాండింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది. రాడార్లలో టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఇలా జరిగిందని భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారి ఒకరు ప్రకటించారు.

మారిషస్ లో దిగిన సుష్మా స్వరాజ్.. ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగన్నాథంతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలు జరిపారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బయల్దేరి వెళ్లారు విదేశాంగ మంత్రి.