నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 04)

273
today programs in hyderabad

పురస్కారాల ప్రదానం
కార్యక్రమం: ఆరాధన-శ్రీకరీ 23వ టీవీ పురస్కారాల ప్రదానం, ఉత్తమ యాంకర్‌కు స్వర్ణపతక బహూకరణ, సాయి లలిత మ్యూజిక్‌ అకాడమీచే తెలుగు-హిందీ సంగీత విభావరి.
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 5.45గం.

బాలు-మల్లెల పురస్కారం
కార్యక్రమం: మల్లెల కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురే్‌షకి ‘బాలు-మల్లెల పురస్కారం-2018’ ప్రదానం. మధుమాసవేళలో..మధురమే సుధాగానం సినీ సంగీత విభావరి.
ముఖ్యఅతిథి: డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
స్థలం: సుందరయ్య కళానిలయం,
బాగ్‌లింగంపల్లి
సమయం: సాయంత్రం 5.30గం.



జయంతి
కార్యక్రమం: త్యాగరాయగానసభ, బృందావనం సంయుక్త ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి జయంతి. వై సుబ్రహ్మణ్యం నిర్వహణలో శ్రీ త్యాగరాజ కీర్తనలు
ముఖ్యఅతిథి: విన్నకోట మురళీకృష్ణ
సభాధ్యక్షుడు: కళావీఎస్‌ జనార్దనమూర్తి
ప్రధాన వక్త: డాక్టర్‌ ద్వానా శాస్ర్తి
ఆత్మీయ అతిథి: వై. సుబ్రహ్మణ్యం
స్థలం: కళా లలిత కళావేదిక
సమయం: సాయంత్రం 6గం.

సమావేశం
కార్యక్రమం: వరల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా ‘ బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’ అంశంపై సమావేశం
ముఖ్యవక్తలు: కె. పురుషోత్తం రెడ్డి, బీవీ సుబ్బారావు
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: ఉదయం 11గం.

పోస్టర్‌ ఆవిష్కరణ
కార్యక్రమం: పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్ర గడ్చిరోలి, తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన మారణకాండలపై ‘బహిరంగ సభ’కు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ.
ముఖ్యఅతిథులు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ గడ్డం, నారాయణరావు తదితరులు
స్థలం: ఎన్‌ఎ్‌సఎ్‌సన్యూస్‌ సెంటర్‌,
హైదర్‌గూడ
సమయం:ఉదయం 11.30గం.