ఆచార్య : మారేడుమిల్లి షూటింగ్ లో చిరు, చరణ్… వీడియో వైరల్

429
Acharya: Chiranjeevi- Ram Charan At Shooting Spot Maredumilli

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ ‘ఆచార్య’ మూవీ రూపొందిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు ‘సిద్ద’ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ఆచార్య’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉండగా… కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది.

మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. మే 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.