తన కుమారుడు రవితేజపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పందించారు. గంటా రవితేజ, హీరోయిన్ సాయిపల్లవిపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని…తన కుమారుడు, సాయిపల్లవి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించనన్నారు. అవాస్తవమైన విషయాలను నిరాధారమైన ఆరోపణలతో ప్రచారం చేయొద్దని తెలిపారు. ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం తగదని మంత్రి గంటా సూచించారు. తన కుమారుడికి వివాహమైందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇలాంటివి ఎలా ప్రచారం చేస్తారని గంటా ప్రశ్నించారు.
మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఆ సినిమాలో కనిపించారు.