సిద్దిపేటకు జాతీయ స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డు

268
siddipet got national excellence award

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలకు జాతీయ స్థాయిలో అందించే స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు సిద్దిపేట మున్సిపాలిటీ ఎంపికైంది. పట్టణంలోని మహిళా సమాఖ్య పరిధిలోని సాయి తేజ స్లమ్‌ సమాఖ్య సభ్యులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థికంగా తోడ్పాటునందించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇటీవల క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా బృంద సభ్యులు సిద్దిపేటను సందర్శించి కేంద్రానికి నివేదిక అందించింది. ఈ మేరకు కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ వైఎస్‌ అవాన సిద్దిపేటను స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మార్చి 29న ఢిల్లీలో జరిగే అవార్డు ప్రదానంలో మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, ఎస్‌ఎల్‌ఎఫ్‌ సభ్యులు పాల్గొననున్నారు.స్వచ్ఛ సిద్దిపేట.. పరిసరాల పరిశుభ్రత.. చెత్త సేకరణ.. హరితహా రం.. మోడల్ శ్మశానవాటికల నిర్మాణంతో ఇప్పటికే రాష్ట్రంలోఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు అందుకున్న సిద్దిపేటకు మరో పురస్కారం వరించింది. తాజాగా జాతీయస్థాయి స్వచ్ఛత ఎక్సెలెన్స్ అవార్డుకు సిద్ధిపేట మున్సిపాలిటీ ఎంపికైంది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా జాతీయ స్థాయి లో ఏరియా లెవల్ ఫెడరేషన్ (రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఎల్‌ఎఫ్- స్లమ్ లెవల్ సమాఖ్య ) బహిరంగ మల విసర్జన లేని- ఓపెన్ డెఫికేషన్ పట్టణంగా తీర్చిదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించిన స్లమ్ సమాఖ్య చేపట్టిన కార్యక్రమాల పై గత అక్టోబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా 32 మున్సిపాలిటీ, నగర పంచాయతీల కెటగిరీల నుంచి నామినేషన్ల స్వీకరించింది.

ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణ మహిళా సమాఖ్య పరిధిలోని శ్రీ సాయి తేజ స్లమ్ సమాఖ్య కంచరి బజార్‌కు చెందిన స్లమ్ సమాఖ్య సిద్దిపేట పట్టణంలోని వివిధ స్లమ్‌లలో ఉన్న సంఘాల ఉత్తేజపరిచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థికతోడ్పాటునందించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. ఇటీవల క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా సిద్దిపేట పట్టణాన్ని సందర్శించి కేంద్రానికి ఈ విషయమై నివేదిక అందించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వ పట్టాణాభివృద్ధి మంత్రి త్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ వైఎస్. అవాన నుంచి సిద్దిపేట మున్సిపాలిటీని స్వచ్ఛత ఎక్సెలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆహ్వానం అందిందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.


తెలంగాణ నుంచి మెప్మా మిషన్ డైరెక్టర్‌గా తెలంగాణ వ్యాప్తంగా 32 ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో ముఖ్యపాత్ర పోషించిన స్లమ్ సమాఖ్యల నుంచి నామినేషన్లు కోరగా, అచ్చంపేట, కల్వకుర్తి, సిద్దిపేట, సూర్యాపేట, హుజూరాబాద్, హుజూర్‌నగర్, సత్తుపల్లి, మధిర, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, బడంగ్‌పేట, భువనగిరి, బైంసా, నర్సంపేట, సిరిసిల్ల, వేములవాడ- నగర పంచాయతీలను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా బృందం పర్యటించి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ-మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళ, ఆర్పీ, ఓబీ, సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శుల కృషితో ఎస్‌ఎల్‌ఎఫ్ స్థాయిలో జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ మేరకు మార్చి 23న ప్రవాసీ భారతీయ కేంద్రం చాణిక్యపురి వేదికగా న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించే వర్క్‌షాప్‌లో అవార్డు అందజేయన్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీసాయితేజ స్లమ్ సమాఖ్య ప్రతినిధులు అవార్డును అందుకోనున్నారు.