12 నుంచి ఒంటిపూట బడులు

245
half day school timetable in ap 2018

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 12 నుంచి ఒంటిపూట వరకే జరుగుతాయి. 2017-18 సంవత్సరపు అకడమిక్‌ కేలండర్‌కు లోబడి, ముందస్తు ఎండల కారణంగా విద్యార్థులు ఇబ్బందికి గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాఠశాలలు పనిచేస్తాయి. ఈ టైం టేబుల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. 

పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్‌ 23. ఆ మరుసటి రోజు నుంచి వేసవి సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాకమిషనర్‌ కె.సంధ్యారాణి ఈ మేరకు ఆర్‌జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు.