యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలి కి ముందు ఆ తరువాత అని చెప్పొచ్చు …
ఒక రేంజ్ లో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకొని తెలుగు ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
ఇక కేజీఎఫ్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కిశోర్ డైరెక్షన్ లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ తప్ప ఇంకా మిగతా నటీనటుల లిస్ట్ ఇంకా ఫైనల్ చెయ్యలేదు.
అయితే ‘సలార్’ మూవీ లో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రాహంను కలిసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచాయి, ఒక స్టార్ హీరోను అనుకుంటున్నట్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఎవరో అనుకుంటున్నారా.. కోలీవుడ్ విలక్షణ నటుడు ఏ క్యారెక్టర్ అయిన అవలీల గా చేయగల విజయ్ సేతుపతి. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,
ఆయన ఉంటే చాలు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంటుంది. ఇదే క్రేజ్‌తో ఇటీవల ఆయన బాలీవుడ్‌లోను కూడా అడుగు పెట్టి తన చాటనున్నాడు.
ఇటీవలే విడుదల అయిన మాస్టర్ సినిమా లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు..
ఇక ఈ వార్త తో సలార్ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.