మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా “ఉప్పెన”తోనే తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నారు.
నేచురల్ లుక్, కెమెరా ముందు అద్భుతమైన నటన కనబర్చి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. సినిమా వసూళ్ళ పరంగా దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ముందుకొచ్చారట.
ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నాగార్జున.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది.
అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బానర్‌పై వైష్ణవ్ తేజ్ తో ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.
మొదటి సినిమా ‘ఉప్పెన’కు 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్‌కి ఏకంగా మూడు కోట్ల రుపాయల భారీ ఆఫర్ ఇచ్చారట నాగార్జున.
ఈ మేరకు డిఫరెంట్ కథను ఎంచుకున్న నాగ్.. ఈ సినిమాను కొత్త ఓ దర్శకుడితో రూపొందించబోతున్నారని సమాచారం.