హైదరాబాద్ లో అజిత్ సైక్లింగ్… పిక్స్ వైరల్

293
Thala Ajith Spotted In Cycle At Hyderabad

తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు.

అయితే ఆయన ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు.

సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు.

అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Suresh Kumar (@sureshkumarlb)

అజిత్ కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న అజిత్ ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

‘వలిమై’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా అజిత్ కనిపించనున్న ఈ మూవీని 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.