“మోసగాళ్లు” ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్

299
Mosagallu Telugu Movie Trailer Released by Chiranjeevi

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్లు”.

జెఫ్రే గీ చిన్ “మోసగాళ్లు” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నవీన్‌చంద్ర, రుహీసింగ్‌, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. “మోసగాళ్లు” చిత్రంలో ఏసీపీ కుమార్‌ అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 25న విడుదల చేశారు.

“యుఎస్‌లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్‌ మీద జరిగిన ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ.. మంచు విష్ణుతో పాటు టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

2015లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ముంబయి, గుజరాత్ లలో ఉండి ఒక సింపుల్ ఐడీయాతో అమెరికాలో 4 వేల కోట్ల స్కామ్ చేశారు.

అది ఎలా చేశారు? ఆ డబ్బు ఎక్కడుంది? ఇంతకీ వాళ్ళు దొరికారా? లేదా?అనే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని చేశాం. యుయస్‌లో ఉండి ఈ కథని డెవలప్ చేశాం.

అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ స్కామ్ వల్ల అక్కడ కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి.

మూడు సంవత్సరాలు ‘మోసగాళ్ళు’ కథపై వర్క్ చేశాం అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

సరికొత్తగా ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని స్వయంగా మంచు విష్ణు నిర్మిస్తుండడం విశేషం. కాగా అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.