పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ భారీ బడ్జెట్ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కథతో క్రిష్ మ్యాజిక్ చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్నఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
This #MahaShivaratri, trance into the Periodic Extravaganza with #PSPK27 First Look & Title on 11th March 💥💫
Get Ready to rejoice the Mighty POWER 🔥#PSPK27FirstLookOnMar11 Power Star @pawankalyan @DirKrish #AMRatnam @mmkeeravaani #ADayakarRao
— Mega Surya Production (@MegaSuryaProd) February 24, 2021
దీంతో మహాశివరాత్రి పర్వదినాన స్పెషల్ ట్రీట్ ఇవ్వనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.