స్వతంత్ర ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు

183
IT attacks on independent MLA home

హర్యానా స్వతంత్ర ఎమ్మెల్యే బాలరాజు కుందూ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకుఎమ్మెల్యే బాలరాజు మద్ధతు ఇచ్చారు.

రైతుల ఉద్యమంలో మేహం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలరాజ్ పాల్గొన్నారు.

దీంతో గురువారం బాలరాజ్ కుచెందిన కార్యాలయాలు, ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

రోహతక్ లోని సెక్టార్ 14. గురుగావ్ లోని అతని ఇళ్లు, హిసార్ హంసీలోని అల్లుడి ఇల్లు,  అతని ఇద్దరు సోదరుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

అలాగే ఎమ్మెల్యే సన్నిహితులకు చెందిన 30 ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడి చేసి తనిఖీలు జరిపారు.

రాజకీయ కక్షతోనే ఐటీ అధికారులు దాడులు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే కార్యాలయ అధికారి దేవేందర్ సింగ్ ఆరోపించారు.