అన్‌లాక్ తర్వాత కరోనా వైరస్ తన రూపాని మార్చుకుందని వార్తలు వస్తున్నాయి. స్ట్రెయిన్ అనే పదాన్ని కూడా వింటున్నాం.
అంటే ఆ జీవి తన రూపాన్ని మార్చుకుందని అర్థం. చాలా అరుదుగా కొన్ని జీవుల్లో మార్పులు వస్తుంటాయి. అవి అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి.
సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్నైతే.. జన్యుపరమైన మార్పులు కొన్ని ఉంటాయి. ఇదిగో ఈ వింత చేపలాగ. ఇది షార్క్ చేప. దీనికి మ్యుటేషన్ జరిగిన ఆకారం మారిందని అంటున్నారు.
ఈ షార్క్ చేప కళ్లు మిగతా చేపల కంటే పెద్దదిగా ఉంటాయి. మనిషి కళ్లలాగే గుండ్రంగా కూడా ఉంటాయి. కనుగుడ్లు మనిషివిలాగే కనిపిస్తాయి.
అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేప కళ్లు పక్కపక్కన ఉన్నాయి. నోరు కూడా మారింది.
దీంతో ఈ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంది. ఈ భూమిపై ఉన్న రకరకాల జీవరాసులపై శాస్త్రవేత్తలకు పూర్తి స్పష్టత ఉంది.
సముద్రాల్లో, మంచు దీవుల్లో ఉన్న వాటిపై మాత్రం అంతగా క్లారిటీ లేదు. కొత్త జీవరాసులపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ షార్క్ చేప కొత్తదేమీ కాదు కానీ విచిత్రంగా కనిపించడమే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇండోనేషియాలోని ఓ జాలరికి చిక్కిన ఈ షార్క్ చేపను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అబ్దుల్ నూరేన్ అనే వ్యక్తి జాలరి. చేపలు పట్టేందుకు అది తూర్పు నుసా తెంగ్గరా ప్రావిన్స్‌లోని రోబో డావో ప్రాంతం. ఇతను చేపలు పడుతుండగా ఓ పెద్ద షార్క్ చేప వలలో పడింది.
వల చిరిగిపోయేలా ఉందనుకుంటూ దాన్ని వేగంగా పదవలో వేసుకున్నాడు. రోజులాగే దాన్ని ఒడ్డుకు తెచ్చి పొట్ట కోశాడు. దాని కడుపులో మూడు చిన్నషార్క్ చేపలు కనిపించాయి.
రెండు చేపల్లో ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ మరో దానికి మాత్రం మనిషి ముఖం ఉంది.