ఆ రోజుల్లో అభద్రతాభావం, భయం వెంటాడేవి : ప్రియాంక చోప్రా

307
Priyanka Chopra on overcoming insecurities and dealing with loss

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవలే తన కెరీర్‌లోని జ్ఞాప‌కాల‌తో తన ఆత్మకథను ‘అన్‌ఫినీష్‌డ్’ అనే పుస్తకం రూపంలో అందరి ముందుంచింది ప్రియాంక.

అయితే ఈ బుక్ లో ఆమె తెలిపిన విషయాలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.

కెరీర్ ఆరంభంలో తనకు దర్శకనిర్మాతల నుంచి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, కొందరు దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బట్టలు విప్పి చూపించమన్నారని, సర్జరీలు చేయించుకోమన్నారని సంచలన ఆరోపణలు చేసింది.

దీంతో ప్రియాంక ఆరోపణలు చేసిన ఆ దర్శకనిర్మాతలు వీరే అంటూ జనాల్లో చర్చలు మొదలయ్యాయి.

ఇదే విషయమై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకకు ఈ విషయాన్ని అప్పట్లోనే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు రివీల్ చేశారు? అని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన ప్రియాంక ఆ రోజుల్లో అభద్రతాభావం, భయం వెంటాడేవని, అందుకే ఆ విషయాలను బయట పెట్టలేకపోయానని పేర్కొంది.

మరోవైపు ప్రియాంక రిలీజ్ చేసిన ఈ ‘అన్‌ఫినీష్‌డ్’ పుస్తకం అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందుతోంది. మార్కెట్‌లో విడుదలైన వారంలోపే ఈ పుస్తకం రికార్డు సృష్టించింది.