చిరంజీవి, సురేఖల 42వ వివాహ వార్షికోత్సవం… విష్ చేసిన చరణ్

289
Chiranjeevi Surekha 42nd Wedding Anniversary

నేడు మెగాస్టార్ చిరంజీవి, సురేఖల 42వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులకు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు రామ్ చ‌ర‌ణ్ “నా బ‌లం మీరు… ఇద్ద‌రికి 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్ష‌లు” అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌ల్లిదండ్రుల ఫొటోని షేర్ చేశారు.


దీంతో మెగా అభిమానులు చిరంజీవి, సురేఖ దంపతులకు సోషల్ మీడియా ద్వారా 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా తరువాత “లూసిఫర్” రీమేక్ లో నటించనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

ఇక చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఇందులో అల్లూరి సీత‌రామ‌రాజు పాత్ర‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న భారీ అంచనాలు నడుమ విడుదల కానుంది.