మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన “ఉప్పెన” చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై అంచనాలను అందుకుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.
భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును కూడా ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, కథ, బుచ్చిబాబు దర్శకత్వం, పాటలు ఈ ‘ఉప్పెన’ సినిమా విజయవంతం కావడానికి కారణమని చెప్పొచ్చు.
తొలివారం విజయవంతంగా దూసుకెళ్లిన ఈ సినిమా నిర్మాతలను ఇప్పటికే లాభాల బాట పట్టించింది. అయితే ఈరోజు నుంచి “ఉప్పెన”కు బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఎందుకంటే శుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఈ పోటీని “ఉప్పెన” తట్టుకుంటుందో లేదో చూడాలి.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 6వ రోజు (1.93 కోట్ల)తో పోల్చితే 20% రేంజ్ డ్రాప్స్‌తో 7వ రోజు 1.44 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంది ఉప్పెన.
7వ రోజు ఏరియాల వారిగా షేర్ :
నైజాం- 38 లక్షలు
సీడెడ్- 22 లక్షలు
ఉత్తరాంధ్ర- 34 లక్షలు
ఈస్ట్ గోదావరి- 17 లక్షలు
వెస్ట్ గోదావరి – 8 లక్షలు
గుంటూరు- 9.1 లక్షలు
కృష్ణా- 9 లక్షలు,
నెల్లూరు- 11 లక్షలు
తొలివారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు “ఉప్పెన” టీం ప్రకటించింది.
Telugu cinema is truly back to it’s glory. #Uppena grosses over 70 Crores in the first week.#BlockbusterUppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/Okq0dctwNH
— BARaju (@baraju_SuperHit) February 19, 2021