గని : హైదరాబాద్ లో ఉపేంద్ర… వరుణ్ తేజ్ ను ధీ కొట్టడానికి…!

174
Upendra Joins the shoot of VarunTej's Ghani

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “గని”. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో వరుణ్ బాక్సార్‏గా కనిపించనున్నారు.

మెగా వారసుడు వరుణ్ తేజ్‌ని ఢీ కొట్టేందుకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఏంటి అర్థంకాలేదా..? అదేనండీ.. వరుణ్ తేజ్ హీరోగా ఆయన కెరీర్‌లో 10వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ‘

తాజాగా ‘గని’ సెట్స్ పైకి వచ్చేశారు రియల్ స్టార్ ఉపేంద్ర. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు గాను ఉపేంద్ర హైదరాబాద్ చేరుకున్నారు.

ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన ఆయన సెకండ్ షెడ్యూల్‌లో వరుణ్ తేజ్, ఉపేంద్రలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ముందుగా ఈ చిత్రాన్ని జులై 30 విడుదల చేయాలని భావించిన దర్శకనిర్మాతలు.. అదే రోజు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్న నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.