మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్, శంకర్ కాంబో గురించి తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.
ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఇది 50వ సినిమా కానుండటంతో భారీ రేంజ్‌లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు.
ఈ మేరకు శంకర్‌తో డిస్కషన్స్ నడుస్తున్నాయట. అయితే ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతినిచ్చేలా 3D ఫార్మాట్‌లో రూపొందించాలని చూస్తున్నారట శంకర్.
ఇక ఈ భారీ చిత్రంలో హీరోయిన్ విషయమై పలువురి పేర్లు పరిశీలించిన శంకర్.. క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న పేరును సూచించారట. రష్మికనే ఈ సినిమా కోసం ఫైనల్ చేయబోతున్నారని టాక్.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ మూవీతో పాటు బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న ’మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమాలో నటించనుంది.