“జార్జ్ రెడ్డి” దర్శకుడితో పూరి జగన్నాథ్ తనయుడు

236
Akash Puri's Chor Bazaar Launched Today

పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి కొత్త చిత్రం ప్రారంభమైంది. “జార్జ్ రెడ్డి” చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి “చోర్ బ‌జార్” అనే చిత్రం చేయనున్నాడు ఆకాష్ పూరి.

వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తొలిసారిగా నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సుబ్బరాజు, పోసాని, “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభం అయ్యింది. ఫిబ్ర‌వ‌రి 26 నుండి చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.

కాగా ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కృషి చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆకాష్ పూరి మూడు సినిమాల్లో నటించగా… ఒక్క సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కలేదు.

మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.