సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న ఓ బాలీవుడ్ వీడియో ఆల్బమ్ లో మెరిసింది. “టాప్ టక్కర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సాంగ్ ఆల్బమ్ ను తాజాగా విడుదల చేశారు.
పాపులర్ హిందీ సింగర్, రాపర్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఈ పాటను పాడారు.
ఈ ఆల్బమ్ లో బాద్‌షా, యువన్ శంకర్ రాజాలతో పాటు రష్మిక మందన్న కూడా ఉంది.
రష్మిక బాలీవుడ్ లో ఇలాంటి వీడియో ఆల్బమ్ లో నటించడం ఇదే మొదటిసారి.
రష్మిక ఈ వీడియోలో గ్లామరస్‌గా, కలర్ ఫుల్ గా, చాలా అందంగా కన్పిస్తోంది. మీరు కూడా “టాప్ టక్కర్” ఆల్బమ్ ను వీక్షించండి.
ప్రస్తుతం రష్మికా మందన్న తమిళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది.
తెలుగులో అల్లు అర్జున్ “పుష్ప” సినిమా చేస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న “మిషన్ మజ్ను”తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.