టీ ఎస్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

122

తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది.

ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ప్రస్తుతం మూడు ఎంట్రెన్స్‌లకు మాత్రమే తేదీలు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

జూన్‌ 20న పీజీఈసెట్‌, జూలై 1న ఈసెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

మిగతా ప్రవేశ పరీక్షలు డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్‌లో ఉంచింది. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉంది.

పరీక్షల షెడ్యూల్‌:

జూన్‌ 20న పీజీ ఈసెట్‌

జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌

జులై 1న ఈ-సెట్‌