మహాసముద్రం : చుంచు మామగా జగపతి బాబు… బర్త్ డే స్పెషల్…!

360
Jagapathi Babu as Chunchu Mama in Mahasamudram

శ‌ర్వానంద్, సిద్ధార్ద్ ప్ర‌ధాన పాత్రధారులుగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మహాసముద్రం”. అదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

సీనియర్ హీరో జగపతి బాబు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు జగపతి బాబు పుట్టినరోజు.

ఈ సందర్భంగా “మహాసముద్రం” చిత్రం నుంచి జగపతిబాబు లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం.

ఇందులో జగపతిబాబు రఫ్ లుక్ లో కన్పిస్తున్నారు. ఆ లుక్ చూస్తుంటే ఆయన నెగెటివ్ రోల్ లో కనిపిస్తారని అర్థమవుతోంది. చుంచు మామ అనే పాత్ర‌ పోషిస్తున్నారు జగ్గు భాయ్.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ పోస్ట‌ర్ కు మంచి స్పందన లభించింది.

మరోవైపు దర్శకుడు అజయ్ భూపతి “ఆర్ఎక్స్ 100” చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని “మహాసముద్రం” రూపొందిస్తున్నారు.

హీరో సిద్ధార్థ్ కూడా చాలాకాలం తరువాత ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించనున్నారు. దీంతో “మహాసముద్రం”పై అంచనాలు భారీగానే ఉన్నాయి.