బాలీవుడ్ లో రష్మిక ఫస్ట్ డే షూట్… !

338
Rashmika Mandanna begins shoot for Bollywood Movie Mission Majnu

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న స్టార్స్ సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో సత్తా చాటిన రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం “మిషన్ మజ్ను”.

ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శాంత‌ను బాగ్‌చి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ రోన్నీ స్క్రూవాలా, అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా… రష్మిక, సిద్ధార్థ్ మల్హోత్రా ‌స్ట్ డే షూట్‌లో జాయిన్ అయ్యారు. స్పెష‌ల్ టీంతో మొద‌టి రోజు ప్ర‌త్యేక‌మైన‌ది అంటూ ర‌ష్మిక‌తో క‌లిసి స్క్రిప్ట్ బుక్‌ను ప‌ట్టుకున్న స్టిల్ ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సిద్దార్థ్ మ‌ల్హోత్రా.

ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే… పాకిస్థాన్ లో భార‌త సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (రా) చేపట్టిన అతిపెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ “మిషన్ మజ్ను”.

ఇందులోని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది.