సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “లైగర్”.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అనన్య పాండే ‘లైగర్’ సినిమా అప్డేట్ ఇచ్చారు.
రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిన్న వీడియో ట్రాక్ తో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Breaking all the barriers of language,A Pure Dhamakedaar Entertainment Ride is coming for you soon
Tune in Tomorrow @ 8.14AM for ReleaseDateAnnouncement#LIGER #saalacrossbreed #PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/S7TKJ3tMFD
— Charmme Kaur (@Charmmeofficial) February 10, 2021
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న “లైగర్” తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.