పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అనిత

233
Anita Hassanandani blessed with a baby boy

హీరోయిన్ అనిత హస్సానందిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిత భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అనితను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ “ఓహ్ బాయ్” అని కామెంట్ చేశారు.

రోహిత్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ వార్తను షేర్ చేయగానే వారి స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“నువ్వు నేను” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అనిత ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. అనంతరం హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు.

యే మొహబ్బతే, నాగిని వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించారు.

2013లో అనిత, బిజినెస్ మెన్‌ రోహిత్‌రెడ్డి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన ఏడేళ్ల తర్వాత ఫిబ్రవరి 9న ఈ దంపతులు మొదటి సంతానానికి జన్మనిచ్చారు.

దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)