“సలార్”లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా

176
Priyanka Chopra special song in Prabhas Salaar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది.

పక్కా కమర్షియల్‌ ఎంటైర్‌టైనర్‌గా రూపొందుతున్న “సలార్”లో ఓ ఐటెమ్‌సాంగ్‌ను ప్లాన్‌ చేశాడట దర్శకుడు ప్రశాంత్ నీల్.

అయితే “సలార్”‘ ప్యాన్‌ ఇండియా మూవీ కాబట్టి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ఐటెమ్ సాంగ్ లో నర్తింపజేయాలని భావిస్తున్నారట.

ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “సలార్”.

ఈ సినిమాలో ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రామగుండంలో ప్రారంభించారు. సినిమా షూటింగ్‌ గోదావరి ఖనిలో జరుగుతుంది.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు విలన్ కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.