చందమామ కాజల్ కొత్త పేరు ఇదే…!

238
Kajal Aggarwal changes her last name

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తాజాగా తన పేరును మార్చుకున్నారు. ఈ అందాల చందమామ గత ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్ళి చేసుకుంది.

ప్రస్తుతం కాజల్, గౌతమ్ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. పెళ్ళి త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవులు టూర్‌ వెళ్ళింది.

అక్కడ భర్తతో కలిసి కాజల్ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.


తాజాగా కాజల్ పేరు మార్చుకున్న విషయం చర్చనీయాంశంగా మారింది. పెళ్ళి త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న పేరుని ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చింది.

భ‌ర్త పేరు , త‌న ఇంటి పేరు క‌లిసి వ‌చ్చేలా కాజల్‌ ఎ కిచ్లు అని పెట్టుకుంది.

ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పైనే అయింది. త‌న కెరీర్‌లో గ్లామ‌ర్ పాత్ర‌లు, సీరియ‌స్ పాత్ర‌లతో కాకుండా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చే పాత్ర‌ల‌లో న‌టించి అశేష అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న “ఆచార్య” చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకుంది కాజల్.

ఇక కాజ‌ల్ న‌టించిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పెళ్ళి తరువాత కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది కాజల్.