ఇకపై థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ…!

173
100% Occupancy Allowed in Cinema Halls

గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుండడంతో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా అరికట్టడంతో భాగంగానే స్కూళ్ళు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కరోనా కలకలం తగ్గడంతో ఒక్కొక్కటిగా, నెమ్మదిగా అన్నీ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. అయితే గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది ప్రభుత్వం.

కానీ ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే న‌డ‌ప‌డానికి అనుమ‌తి ఉండేది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది.

ప్రస్తుత నిర్ణయంతో థియేటర్ ఓనర్లు, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ఇటివలే కేంద్రం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.