1990లో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవత. ఇందులో శ్రీదేవి, శోభన్ బాబు మధ్య వచ్చే వెల్లువచ్చె గోదారమ్మ అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బిందెల మధ్య వీరిద్దరు నృత్యం చేయడం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. నిన్నటి తరాన్ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ పాట కొత్త తరాన్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఇదే సాంగ్‌ని సేమ్‌లో స్టైల్‌లో రీమేక్ చేస్తున్నారు వాల్మీకి చిత్రబృందం. వరుణ్ తేజ్, పూజా హెగ్డేల మధ్య వెల్లువచ్చె గోదారమ్మ రీమేక్ సాంగ్ చిత్రీకరించగా, అందుకు సంబంధించిన మేకింగ్ వీడియో తాజాగా విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకి రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకి మూవీని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. హిందీ దబాంగ్‌ను తెలుగులో గబ్బర్‌సింగ్‌గా తీసి సెన్షేషన్ క్రియేట్ చేశాడు. వాల్మీకితో మరో సంచలనం కోసం ఎదురు చూస్తున్నాడు.