ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 17 సెప్టెంబర్ 2019

321
today rashi phalalu

మేష రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతారు.

వృషభ రాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులోఇబ్బంది పడే అవకాశముంటుంది.

మిథున రాశి : ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. ఆకస్మిక ధన లాభం కానీ, మిత్రుల సందర్శన కానీ ఉంటుంది.

కర్కాటక రాశి : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. మీ సంతానంతో కలిసి రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

సింహ రాశి : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శతృవులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోవటం కాని మోసపోవటం కాని జరగవచ్చు.

కన్య రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

తుల రాశి : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుుసుకుంటారు. రోజంతా ఆనందంగా ఉంటారు.

వృశ్చిక రాశి : ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. విందు, వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటంది.

ధనుస్సు రాశి : ఈ రోజు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. గుండె, ఉదర సంబంధ ఆరోగ్య సమస్య వచ్చే అవకాశముంటుంది. తీసుకునే ఆహారం, నీరు విషయంలో జాగ్రత్త అవసరం. ఆవేశానికి లోను కాకండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు.

మకర రాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యంలో కొంత మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు పనుల్లో నిమగ్నం చేసుకోండి. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఏర్పడతాయి. సంయమనంతో మెలగటం వలన సమస్యలు తగ్గుతాయి.

కుంభ రాశి : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. మీరు సాధించిన విజయాల కారణంగా మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. సోదరులతో వివాదం ఏర్పడే అవకాశముంది.

మీన రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవటం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినటం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనటం మంచిది. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలం.