దివంగత నటి శ్రీదేవి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వికపూర్. బాలీవుడ్ లో దఢక్ అనే సినిమాతో వెండితెరకి పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం తక్త్`, `కార్గిల్ గర్ల్`, `రూహ్ అఫ్జా` చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే జాన్వీకపూర్ తన ఫిట్‌నెస్‌పై ఎంత ప్రత్యేక శ్రద్ద పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన దైనందిన జీవితంలో వర్కవుట్స్‌కి కూడా కొంత సమయం తప్పక కేటాయిస్తుంది.
తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు పలు రకాల ఆసనాలు చేస్తున్న జాన్వీ కపూర్ ఈ సారి సరికొత్తగా ప్రయత్నించింది. తన పర్సనల్ యోగ ట్రైనర్ నమ్రత పురోహిత్, జాన్వీ ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ అరుదైన ఫీట్ తో కనిపించారు. ఈ వర్కవుట్ ప్రత్యేకతను రివీల్ చేశారు నమ్రత పురోహిత్. ఈ పొజిషన్ బాడీ టోనింగ్ లో భాగంగా మజిల్స్ ని బలంగా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.