మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మహర్షి చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రం నుండి తొలగించిన సన్నివేశానికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో ఫైటింగ్ సన్నివేశాలు ఉన్నాయి
ఈ వీడియోలో మహేశ్, పూజా హెగ్డే కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే విలన్ పాత్ర పోషించిన కమల్ కామరాజు కాలు అడ్డుపెడతాడు. కానీ మహేశ్ అతడిని దాటుకుని వెళ్తాడు. ఆ తర్వాత పూజను క్లాస్‌కు పంపించి కమల్‌తో మాట్లాడతాడు. ‘రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అమ్మాయిలతో తిరగ్గానే హీరో అనుకుంటున్నావా?’ అని కమల్ మహేశ్‌తో పొగరుగా మాట్లాడతాడు. ఇందుకు మహేశ్.. ‘అనుకోవడం ఏంటి? హీరోనేగా’ అని చెప్పే డైలాగ్‌తో కూడిన ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటుంది.