స్టార్ హీరోగా తిరుగులేని ఖ్యాతిని సంపాదించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూసర్‌గా కూడా మారబోతున్నాడు. ప్రస్తుతం హీరోగా బిజీ బిజీగా ఉన్న మహేష్.. ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు. జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ‘ఛార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక మహేష్ నిర్మాణంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ అంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.