ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ 2018

527
IBPS Specialist Officer Recruitment 2018

దేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే సీఆర్‌పీ నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.




పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం పోస్టులు: 1599 (జనరల్-837, ఓబీసీ-418, ఎస్సీ-256, ఎస్టీ-88)
విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ ఆఫీసర్-853, రాజభాష అధికారి-69, లా ఆఫీసర్-75, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-81, మార్కెటింగ్ ఆఫీసర్-302.
వయస్సు: 2018, నవంబర్ 1 నాటికి 20-30 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:

ఐటీ ఆఫీసర్– నాలుగేండ్ల ఇంజినీరింగ్/టెక్నాలజీ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్/ఈసీఈ లేదా పీజీలో ఈసీఈ, ఈఐ లేదా డీవోఈఏసీసీ బీ లెవల్ ఉత్తీర్ణత.

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్– నాలుగేండ్ల అగ్రికల్చర్/హార్టికల్చర్ లేదా తత్సమాన ఇంజినీరింగ్ కోర్సు.
రాజభాష అధికారి- పీజీలో హిందీ/ ఇంగ్లిష్‌తోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్/హిందీ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా పీజీ సంస్కృతంతోపాటు డిగ్రీస్థాయిలో హిందీ/ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

లా ఆఫీసర్– ఎల్‌ఎల్‌బీతోపాటు బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్– డిగ్రీతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా హెచ్‌ఆర్/సోషల్ వర్క్‌లో రెండేండ్ల ఫుల్‌టైం పీజీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

మార్కెటింగ్ ఆఫీసర్-డిగ్రీతోపాటు రెండేండ్ల ఫుల్‌టైం ఎంఎంఎస్/ఎంబీఏ మార్కెటింగ్/పీజీడీబీఎం/పీజీపీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

ఎంపిక: కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు, కామన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు.


పరీక్ష విధానం:
ప్రిలిమ్స్: 150 ప్రశ్నలు. 125 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల కాలవ్యవధి.
మెయిన్: ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ -60 ప్రశ్నలు- 60 మార్కులు-45 ని॥ సమయం. రాజభాష అధికారి పోస్టుకు ఈ పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 100/-)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 6 నుంచి
చివరితేదీ: నవంబర్ 26
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2018, డిసెంబర్ 29, 30
మెయిన్ ఎగ్జామ్: 2019, జనవరి 27
వెబ్‌సైట్: www.ibps.in