యువ దర్శకుడితో శ్వేత బసు నిశ్చితార్థం

440
swetha-basu-engagement-with-bollywood-director

‘కొత్త బంగారు లోకం’లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్‌లో సీరియల్స్, లఘు చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అంతేకాదు గ్యాంగ్‌స్టర్స్ అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ దర్శకుడితో శ్వేత బసు ప్రసాద్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. లఘు చిత్రాల దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో శ్వేత బసు ప్రసాద్ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇక పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే కొన్ని రోజులుగా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు.