బాహుబలి కి మూడు జాతీయ అవార్డులు

640
baahubali-2-got-three-national awards

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన తెలుగు సినిమా బాహుబలి-2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ శుక్రవారం మధ్యాహ్నం ఈ అవార్డులను ప్రకటించారు. మే 3న విజేతలకు అవార్డులు ప్రదానం జరగనుంది.

బాహుబలి అవార్డులివే..

బెస్ట్ ఫిల్మ్ ఎంటర్‌టైన్మెంట్
బెస్ట్ యాక్షన్
బెస్ట్ స్పెషల్ ఎఫెక్స్ట్

ఈ మూడు అవార్డులు బాహుబలిని వరించాయి.



 

కాగా.. ఒక తరం మొత్తం పూర్తి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిల్చిపోనున్న సినిమా బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. భారత చలన చిత్ర చరిత్రలో అత్యంత సాహసేపేతమైన చిత్రం మన టాలీవుడ్ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో అద్వితీయమైన వర్ణన, అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్టులు ఈ సినిమాలో చూడవచ్చు.